ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ కు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ పంపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమల్లోకి రాగానే రాజీనామా ఆమోదించాలని స్పీకర్ ను గంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానన్న ఆయన ప్రైవేటు కాకుండా పోరాటం చేస్తానని అన్నారు.
స్వయంగా రాజీనామా పత్రం రాసిన గంటా శ్రీనివాస్, పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు,ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. మాటల మనిషిని కాదు…చేతల మనిషిని అని ఆయన అన్నారు. ఇక ఆయన చాలా రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో చాలా రోజులుగా అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన వైసీపీలో చేరతారు అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.