మండలి రద్దుపై ఎమ్మెల్యే గంటా హాట్ కామెంట్స్.. ఏమ‌న్నారంటే..?

-

ఏపీ శాసన మండలి రద్దు చేయాలని సీఎం జగన్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. అయితే ఏపీ శాసన మండలి రద్దుపై అన్ని రాజకీయ పక్షాలు స్పందిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ‘కొద్దికాలం ఆగి ఉంటే వైసీపీకే మెజారిటీ వచ్చేది. ఈ నిర్ణయంతో వైసీపీకే నష్టం వాటిల్లనుంది. మండలి చైర్మన్‌పై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు. కౌన్సిల్‌లో టీడీపీకి మెజారిటీ ఉంది. అధికార పార్టీ దీన్ని అంచనా వేయలేకపోయింది. సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదు. రాజధాని తరలింపు అంత త్వరగా అయ్యే పని కాదు.. కోర్టులు కూడా హెచ్చరిస్తున్నాయి.

విశాఖ పాలనా రాజధానిగా ఈ ప్రాంతవాసులుగా మేము స్వాగతిస్తున్నాం. అయితే పార్టీ నిర్ణయం పార్టీదే. ఈ విషయాన్ని ఎప్పుడో మా పార్టీ అధినేతకు చెప్పాం’ అని గంటా చెప్పుకొచ్చారు. శాసన మండలి రద్దు సహేతుకంగా లేదని కేవలం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని, కోపంతో చేస్తున్నారే తప్ప మరేం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచన చేసి మండలిని తెచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే వైఎస్ జగన్ దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. మండలి రద్దు వెంటనే అమల్లోకి వచ్చే పరిస్థితి లేదని.. ఎప్పటికి అమల్లోకి వస్తుందో కూడా తెలియదంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version