అది ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలోని అమీర్‌నగర్ గ్రామం. శనివారం ఆరవ తరగతి చదువుతున్న ఫర్మాన్ ఖురేషి స్కూల్ బ్రేక్ లో ఒక జామకాయ కొనుక్కున్నాడు. ఇది గమనించి మరో ముగ్గురు విద్యార్ధులు తమకు కూడా జామకాయ కొనాలని ఖురేషిని అడిగారు. అయితే అందుకు అతను నిరాకరించాడు. తాను కొనేది లేదని స్పష్టంగా చెప్పడంతో ముగ్గురు మధ్య గొడవ జరిగింది.
బ్రేక్ అవ్వడంతో ముగ్గురు విద్యార్ధులు క్లాస్ లోకి వెళ్ళిపోయారు. స్కూల్ అయిన తర్వాత ముగ్గురు విద్యార్ధులు ఖురేషీతో గొడవ పడ్డారు. గొడవ జరిగింది ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సోమవారం నలుగురు విద్యార్ధులు స్కూల్ కి చేరుకున్నారు. సోమవారం ఉదయం మళ్ళీ ఖురేషీతో గొడవ పడి అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ ముగ్గురు విద్యార్ధులు చేసిన దాడిలో ఖురేషి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులకు టీచర్స్ సమాచారం ఇవ్వడంతో వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కి తరలించి ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేసారు. ఆ ముగ్గురు వయసు కూడా 15 ఏళ్ళ లోపే కావడం గమనార్హం. ఖురేషి తండ్రి ఫిర్యాదుతో ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే స్కూల్ విద్యార్ధులు మాత్రం అతను ప్రమాదవ శాత్తు మరణించాడని చెప్పడం విశేషం.