కాల్చిన వెల్లుల్లి.. పురుషుల పాలిట వరమే..!!

-

వెల్లుల్లిని వాడని వంటిల్లు ఉండేదు అంటే అతిశయోక్తికాదు.. కొంతమంది మాత్రమే వెల్లుల్లిని వంటల్లో వాడరనుకోండి.. అది వేరే విషయం. పచ్చడి తాలింపులో వెల్లల్లి వేయగానే వస్తుంది ఆ వాసన. అబ్బో.. ఆకలి డబుల్‌ అవుతుంది లే..! వెల్లుల్లిని వంటల్లో వాడితే కడుపుకు మేలు.. ఇది డైరెక్టుగా తింటే.. ఆరోగ్యానికి మేలు.. అర్థంకాలేదా.. రోజూ ప‌ర‌గ‌డుపునే కాల్చిన వెల్లుల్లి రెబ్బ‌లు నాలుగు తింటే చాలు.. బోలెడు లాభాలు.. అవేంటో చూద్దామా..!

పురుషుల్లో టెస్టోస్టిరాన్ వారి శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, వీర్యం త‌యారు అయ్యేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ హార్మోన్ త‌గినంత‌గా లేక‌పోతే చాలా స‌మ‌స్యలు వ‌స్తాయి. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఈ హార్మోన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. హార్ట్ ఎటాక్‌ల‌ను రాకుండా కాపాడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
వెల్లుల్లిలో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని తింటే ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి.
వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లి తింటే నోరు వాస‌న వ‌స్తుంద‌ని కొంద‌రు తిన‌రు. కానీ వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల నోట్లో ఉండే బాక్టీరియా అంతా పోతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు.
పురుషులు కాల్చిన వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
కాల్చిన వెల్లుల్లి తింటే ధమనులు శుభ్రంగా ఉంటాయి, రక్తం గడ్డకట్టదు. అధిక రక్తపోటు సమస్య ఉన్న పురుషులు వెల్లుల్లిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
పురుషులలో శారీరక బలహీనత తొలగిపోతుంది. మీకు ఎక్కువ అలసటగా అనిపిస్తే.. ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటే.. వెల్లుల్లిని పచ్చిగా తినడంతో పాటు వేయించి తినాలి. రోస్ట్ చేసిన వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నేరుగా తిన‌వ‌చ్చు. కానీ వాటిని అలా తింటే.. నోరు చెడిపోతుంది. ఏం తినబుద్ది కాదు..అనుకునేవాళ్లు.. వెల్లుల్లిని రోస్ట్‌ చేసుకుని తినండి.. దీనివల్ల టేస్టీగా ఉంటుంది. మీకు ఆ వెగటు ఫీలింగ్‌ కూడా రాదు. రోస్ట్‌ ఎలా చేయాలో తెలుసుగా.. పెనంపై వెల్లుల్లివేసి సన్నని మంటపై ఉంచి తిప్పడమే.. కొద్దిగా అటు ఇటు వేయిస్తే చాలు.. దీంతో ఘాటుద‌నం త‌గ్గుతుంది. కావాలను కుంటే కాస్త ఆయిల్‌ కూడా వేసి రోస్ట్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news