నవంబర్ ఒకటి నుండి కొత్త రూల్స్…!

-

ప్రతి నెల మొదటి తేదీ నుండి కొన్ని రూల్స్ అమలులోకి వస్తాయి. బ్యాంక్ రూల్స్ మొదలు రైల్వేస్ వరకు చాలా విధాలుగా మారుతూ ఉంటాయి. అయితే ఈసారి నవంబర్ 1 నుండి మారబోయే కొత్త రూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక పూర్తి వివరాలు లోకి వెళితే.. గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ప్రతి నెలా ఏదో ఒకటి మారుతూ ఉంటుంది. ఇక ఈ నెల ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది చూస్తే…

 

gas cylinder
gas cylinder

గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన సమీక్షిస్తూ వుంటారు. కొత్త రేట్లు కూడా జారీ చేస్తారు. సమీక్ష చేసిన తర్వాత సిలిండర్ ధర పెరిగిందా లేదా అనేది తెలుస్తుంది. హోమ్ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఓటిపి చెప్పాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి విత్ డ్రా చేయడానికి కొత్త రూల్స్ ని తీసుకువచ్చారు.

లిమిట్ దాటితే ఫైన్ పడుతుంది. రుణ ఖాతాకి 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలానే నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేస్తే 40 రూపాయలు చార్జీ కట్టాలి. మీది కనుక జన్ ధన్ అకౌంట్ అయితే డబ్బులు డిపాజిట్ చేయడానికి ఎలాంటి చార్జీలు ఉండవు. కానీ వంద రూపాయలు ఉపసంహరణపై చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ మరియు సెంట్రల్ బ్యాంక్ కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ రైలు టైం టేబుల్ ని మార్చింది. మామూలుగా అయితే అక్టోబర్ 1 నుండి ఈ కొత్త రూల్స్ రావాలి కానీ అక్టోబర్ 31 నుండి ఎక్స్టెండ్ చేశారు. 13 వేల పాసింజర్ రైళ్లు, ఏడు వేల గూడ్స్ రైళ్ల వేళలు మారబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news