మళ్లీ ధోనీనే కెప్టెనా.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టు గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది అంచనాలకు తగ్గట్లుగా ఆడకుండా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ అవకాశాలు లేకుండా నిష్క్రమించిన మొదటి జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ అపఖ్యాతి మూటగట్టుకున్నది. ఈ క్రమంలోనే ధోనీని కెప్టెన్గా తప్పిస్తారు ప్రచారం కూడా మొదలు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోనీని కెప్టెన్గా తొలగించే అవకాశం లేదు అంటూ జట్టు యాజమాన్యం తెలిపింది.

dhoni

తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం ధోనీని కెప్టెన్గా కొనసాగిస్తుంది అంటే ఆ విషయంలో తాను ఆశ్చర్యపోను అంటూ గౌతం గంభీర్ తెలిపాడు. చెన్నై జట్టు కోసం ధోనీ ఎంతో చేశాడని నిద్రలేని రాత్రులు కూడా గడిపి ఉంటాడు అంటూ గౌతం గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో మూడు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిపెట్టిన సారథికి చెన్నై యాజమాన్యం ఎంతో గౌరవం ఇస్తుందని అతను కూడా రానున్న రోజుల్లో బాగా రాణిస్తాడు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.