జగన్ బిగిస్తే మేము పీకేస్తాం..!

ఇటీవలే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ దిశగా తీవ్రస్థాయిలో కసరత్తు కూడా చేస్తుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. అయితే ప్రతిపక్ష పార్టీ మాత్రం జగన్ మోహన్ రెడ్డి సర్కారు రైతులకు తీరని అన్యాయం చేసేందుకే మీటర్లు బిగించడానికి నిర్ణయించిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ విమర్శలు గుప్పించారు.

lokesh

తీరు మార్చుకోకుండా ఇలాగే రైతులను ఎగతాళి చేస్తే జగన్ రెడ్డిని గోచి తో నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది అంటూ నారా లోకేష్ విమర్శించారు. నాలుగువేల కోట్ల అప్పు చేసి మరీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం సరైనది కాదు అంటూ విమర్శించారు నారా లోకేష్. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే వాటిని మేము పీకేస్తాము అంటూ హెచ్చరించారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి జగన్ సర్కారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటూ డిమాండ్ చేశారు నారా లోకేష్.