సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ మోషన్ పోస్టర్.. కొత్త లుక్ అదిరిందిగా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుధీర్ బాబు కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ ఎం ఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతోనే కాదు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్బాబు. ఇక ఇటీవలే నాని సుధీర్ బాబు మల్టీ స్టారర్ గా వి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆసక్తికరంగా వుంది అని చెప్పాలి. ఇప్పటివరకు సుధీర్ బాబు నటించని సరికొత్త పాత్రలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో నటించబోతున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.https://youtu.be/j1pwVp7jzFo