సెక్స్ లేకుండా 100 రోజులు ఉండగలవా? గాయత్రి గుప్తను ప్రశ్నించిన బిగ్ బాస్ నిర్వాహకులు

3320

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 పై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను మరోసారి న్యూస్ చానెల్ వేదకగా పంచుకుంది గాయత్రి గుప్తా.

బిగ్ బాస్… హిందీలో ప్రారంభం అయింది. చివరకు తెలుగులోకి కూడా వచ్చేసింది. అయితే మొదటి రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గానే పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. మూడో సీజన్ ప్రారంభానికి ముందే ఎన్నో వివాదాలను కోరి తెచ్చుకుంది.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 పై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను మరోసారి న్యూస్ చానెల్ వేదకగా పంచుకుంది గాయత్రి గుప్తా.

ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు.. బిగ్ బాస్ నిర్వాహకులు నన్ను పలు రకాల ప్రశ్నలు వేశారు. అయితే.. అన్నింటి కన్నా నన్ను బాధించింది ఒకే ఒక ప్రశ్న. 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావంటూ వాళ్లు నన్ను అడిగారు. ఇది బాగ్ బాస్ నిర్వాహకుల దిగజారుడుతనానికి నిదర్శనం.. అంటూ గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు శ్వేతారెడ్డి కూడా బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కోరిక తీర్చాలని.. కమిట్ మెంట్ ఇవ్వాలంటూ శ్వేతారెడ్డిని బిగ్ బాస్ నిర్వాహకులు అడిగినట్టు ఆమె ఆరోపించింది.