తొమ్మిది మందిని చంపి బావిలో వేసిన కేసులో నేడు తుది తీర్పు

-

వరంగల్ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట బావిలో 9 హత్య కేసు ఈరోజు ఫైనల్ జడ్జ్ మెంట్ కు వచ్చింది. ఈ రోజు వరంగల్ జడ్జి జై కుమార్ ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. మే 21న వరంగల్ నగరంలోని గొర్రెకుంట బావిలో వరుసగా మృతదేహాలు కనపడడం సంచలనం రేపింది. మొదట నలుగురు మృత దేహాలు.. 22న మరో 5 మృత దేహాలు మొత్తం తొమ్మిది మంది అనుమానాస్పదంగా చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పట్టుకున్నారు.

సరిగ్గా నెల రోజులకు జూన్ 20న పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. తొమ్మిది మందికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో వేసి హత్య చేసిన నిందితుడు బీహార్‌ కు చెందిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌ పై 7 సెక్షన్ లలో కేసులు నమోదు చేశారు పోలీసులు. హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించడం, విషప్రయోగం ద్వారా చంపడం, చనిపోయిన వ్యక్తులకు చెందిన వస్తువులను దొంగతనం చేసి హత్య నేరానికి పాల్పడిన అభియోగాలపై 7 సెక్షలలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 21 నుండి కోర్టు విచారణ జరిపింది. పోలీసులు సూచించిన 98 మందిలో 67 మందిని జడ్జి విచారించారు. కేవలం 36 రోజులోనే విచారణ పూర్తి చేసి నేడు ఈనెల 28న జిల్లా సెషన్స్ కోర్టులో తీర్పు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news