లేడీస్ కానిస్టేబుల్‌కు జెంట్ టైల‌రింగ్‌.. ఎక్క‌డో తెలుసా..?

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరులో మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు యూనిఫాం కుట్టే విష‌యంలో పోలీసులు తీసుకున్న నిర్ణ‌యం విమ‌ర్శ‌ల పాలైంది. ప‌ట్ట‌ణంలోని ఉమేశ్ చంద్ర హాల్లో సోమ‌వారం స‌చివాలం మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు యూనిఫాం కోసం పురుష టైల‌ర్‌తో కొల‌త‌లు తీయించారు. అక్క‌డే కొంద‌రూ మ‌హిళా పోలీసులున్నా వారితో కొల‌త‌లు తీయించ‌కుండా జెంట్ టైల‌ర్ కొల‌త‌లు తీసుకోవ‌డంతో మ‌హిళా కానిస్టేబుల్లు తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. ఎవ‌రికీ ఫిర్యాదు చేయాలో అర్థం కాక ఇబ్బంది ప‌డుతూనే కొల‌త‌లు ఇచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

జిల్లా ఎస్పీ విజ‌య‌రావు స్పందించారు. మ‌హిళా పోలీసుల‌కు సంబంధించి యూనిఫాం బాధ్య‌త‌ల‌ను ఔట్ సోర్సింగ్‌కు అప్ప‌జెప్పామ‌ని ఒక పురుషుడు కొల‌త‌లు తీసిన‌ట్టు తెలిసిన వెంట‌నే స్పందించి.. దానిని సరిదిద్దామ‌ని ఎస్పీ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ ప్ర‌క్రియ‌కు ఏఎస్పీ వెంక‌ట‌ర‌త్న‌మ్మ ఇన్‌చార్జీగా ఉన్నారు అని మ‌హిళా పోలీసులు దుస్తుల కొల‌త‌లు తీసేందుకు మ‌హిళ‌ల‌నే నియ‌మించాం అని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news