ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త… సేంద్రియ వ్యవసాయంపై కీలక నిర్ణయం

-

అగ్రి ఇన్‌ఫ్రా ‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన నిధుల సేకరణ, టై అప్‌లపై సమీక్షించారు సీఎం. దీనిపై దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలని.. క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలని.. ప్రపంచంలో ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్‌ సెంటర్‌ అని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నాటికి తీసుకు వచ్చేలా ప్రణాళిక చేయాలని.. సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు ఆర్బీకేలో ఏర్పాటు చేయాలని వెల్లడించారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే వాటికి మంచి రేటు వచ్చేలా చూడాలని.. అలాంటి ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఒక విధానం తీసుకురావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news