ఆ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చూసి బౌలర్ కి మైండ్ పోయింది…!

-

క్రికెట్ లో వినూత్న ఆటగాళ్లకు కొదవే లేదు. తమ విన్యాసాలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటారు. వింత ఆటశైలితో ఇతర ఆటగాళ్లను అయోమయానికి గురి చేస్తూ ఉంటారు. కొంత మంది బౌలర్లు బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడానికి గాను వింత బౌలింగ్ యాక్షన్ తో బంతులు విసురుతూ అయోమయానికి గురి చేసి అవుట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగకపోయినా సరే కీలక ఆటగాళ్లను అవుట్ చేయడానికి ఈ విధంగా అనుసరిస్తూ ఉంటారు. ఇక బ్యాట్స్మెన్ విషయానికి వస్తే వాళ్ళు కూడా బౌలర్లను తికమక పెడుతూ,

చుక్కలు చూపిస్తూ ఉంటారు. దిగ్గజ ఆటగాళ్ళలో చాలా మంది ఇలాగే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. సఫారి ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఆట తీరుతో బౌలర్లను తికమక పెడుతూ ఉండేవాడు. అలాగే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్ కలం కూడా ఇదే విధంగా ఆడుతూ బౌలర్ల మీద ఆధిపత్యం ప్రదర్శించే వాడు. ఇక విండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ చంద్రపాల్ బ్యాటింగ్ శైలిని మాత్రం ఇప్పటి వరకు ఏ బౌలర్ అర్ధం చేసుకోలేకపోయాడు. తాజాగా ఇలాగే బ్యాటింగ్ చేసాడు ఆసిస్ ఆటగాడు జార్జ్ బెయిలీ.

గత మూడేళ్ళ నుంచి జాతీయ జట్టుకి ఆడని జార్జ్… దేశవాళి జట్టుకి ఆడుతున్నాడు. బెయిలీ తాజాగా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో భాగంగా టాస్మేనియా-విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తలను మామూలుగానే ఉంచి శరీరం మొత్తాన్ని వికెట్ కీపర్ వైపు పెట్టి క్రీజులో నిలబడ్డాడు. ఎటువైపు నిల్చున్నాడో తెలియక బౌలర్ కి అర్ధం కాక ఇబ్బంది పడ్డాడు. వెంటనే మళ్ళీ నార్మల్ గా ఆడాడు. తన బ్యాటింగ్ శైలితో మైదానంలో ఈ తరహా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news