కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాల్ని అందిస్తోంది. ఈ పథకాలతో చాలా లాభాలు ఉంటాయి. ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికులు కి ఇది బాగా ఉపయోగ పడుతుంది. వయసు పైబడిన తర్వాత ఆదాయ భద్రత ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం నెల నెల రూ. 10 వేలు ఇస్తోంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ప్రయోజనాలని ఇప్పటికే చాలా మంది పొందుతున్నారు. ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెల నెలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా పెన్షన్ కింద కొంత డబ్బుని అందుకోవచ్చు. 18 ఏళ్ల వయసు నిండిన వారు ఇందులో చేరవచ్చు.
కానీ 40 ఏళ్ల లోపు ఉండాలి. 60 ఏళ్ల వయసు తరవాత ఈ స్కీమ్ తో నెలకు రూ. 1000 నుంచి రూ. 5 వేల ని పొందవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ కి అర్హులే. ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఒక నెలలో రూ. 10 వేలు తీసుకోవచ్చు. మీరు ఈ స్కీమ్ లో నెలకు రూ. 42 రూ. 210 వరకు కట్టాలి. వయసు పెరిగే కొద్ది ప్రీమియం మొత్తం కూడా పెరుగుతుంది.
ఆటో డెబిట్ సౌకర్యం కూడా వుంది. కనీసం 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి దీన్ని కట్టవచ్చు. దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులు కూడా ఈ స్కీమ్ ని అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లేదా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి మీరు అప్లై చెయ్యవచ్చు. https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html లో మీరు పేరు నమోదు చేసుకోవచ్చు