కేసీఆర్ ద్విముఖ వ్యూహం..కాంగ్రెస్ జోరుకు చెక్.!

-

రాజకీయాలు ఎప్పుడు ఒకే పార్టీకి అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా అధికార పార్టీలు..ఎప్పుడు తమకే మొత్తం అనుకూలంగా ఉందని అనుకుంటాయి. కానీ అధికార బలంతోనే అలా ఉంటుంది..ప్రజలు పూర్తిగా మద్ధతు ఉన్నట్లు కనిపిస్తారు. కానీ పరిస్తితులు మారిపోతే..వారు మారిపోతారు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. ఇంతకాలం అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకే అంతా అనుకూలంగా రాజకీయం నడిచింది. ఇప్పుడు సీన్ మారుతుంది. కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటూ వస్తుంది.

పైగా మొన్నటివరకు హడావిడి చేసిన బి‌జే‌పి వెనుకబడిపోవడంతో కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది. పైగా కాంగ్రెస్ లోకి వలసలు భారీగా ఎక్కువ అయ్యాయి. దీంతో బి‌ఆర్‌ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఇదే ఊపు కొనసాగితే తమ పార్టీకే నష్టమని కే‌సి‌ఆర్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ బి‌జే‌పి కూడా రేసులో ఉంటే..ప్రభుత్వ  వ్యతిరేక ఓట్లు చీలిపోయి తమకు బెనిఫిట్ జరుగుతుందని, అలా జరగకపోతే కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కే‌సి‌ఆర్ ఇప్పుడు తన వ్యూహాలకు పదును పెట్టారు. మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి రాజకీయం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో ద్విముఖ వ్యూహంలో భాగంగా మొదట..కాంగ్రెస్ లోకి వలసలను కొంత అడ్డుకట్ట వేయాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. హస్తం పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్న నాయకులతో బీఆర్‌ఎస్‌ పెద్దలు వరుసగా సమావేశం అవుతున్నారు. మీరు పార్టీ మారొద్దు.. భవిష్యత్తులో మంచి అవకాశాలను కల్పిస్తామని హామీలిస్తున్నారు. అలా వలసలకు బ్రేక్ వేస్తే కొంతవరకు బి‌ఆర్‌ఎస్ సేఫ్.

ఇక రెండో వ్యూహం ఏంటంటే.. కాంగ్రెస్‌ వారిని తమవైపు లాగేసుకోవడం. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ నేతలతో తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేరేవారిలో కొందరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామనే ఆశ కూడా చూపుతున్నారట.. అది వీలుకాకుంటే భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామనే హామీ ఇస్తున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేయడమే కే‌సి‌ఆర్ వ్యూహం. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news