మీరు రిటైర్ అయ్యాక ప్రతీ నెల డబ్బులు పొందాలని అనుకుంటున్నారా…? అయితే దీని కోసం మీరు తప్పక తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోందన్న సంగతి మనకి తెలిసిందే. అయితే వీటిల్లో రిటైర్మెంట్ పథకాలు కూడా ఉన్నాయి. ఈరోజు అటల్ పెన్షన్ యోజన వలన ఎలా డబ్బులు పొందొచ్చు..? ఎలా డబ్బులు వస్తాయి..? ఇలా పలు విషయాలు చూద్దాం. వివరాల లోకి వెళితే..
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వారికి అటల్ పెన్షన్ యోజన స్కీమ్ సూపర్ గా ఉంటుంది. అది కూడా మీరు రూ.5 వేల వరకు పొందొచ్చు.
మీరు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.5 వేలు పొందాలని భావిస్తే.. ఇప్పటి నుంచి నెలకు రూ.210 కడుతూ ఉంటే సరిపోతుంది. చాల మంది ఈ పధకం లో జాయిన్ అవుతున్నారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అలానే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఉంటే ఈ పథకంలో సులభంగా చేరొచ్చు.
మీరు కట్టే డబ్బుల్ని బట్టి రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. 18 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే మీరు నెలకు రూ.210 కట్టాలి. అదే 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 వేలు పొందాలని భావిస్తే నెలకు రూ.577 చెల్లించాలి. ఈ పధకం లో మీరు జాయిన్ అవ్వాలంటే దగ్గర లో వున్నా బ్యాంక్ కి వెళ్లి చేరవచ్చు.