విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన నిధులు !

విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.  నేడు ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన నిధులు  జమ కానున్నాయి.  జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా తల్లుల అకౌంట్ లకు డబ్బులు సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు.

2020-21 విద్యా సంవత్సరానికి 10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు సొమ్ము జమ చేయనున్నారు. మొత్తం 671.45 కోట్లు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక ఇప్పటి వరకు మొత్తం 4879 కోట్లు విద్యాదీవెన కింద జమ  చేశారు. ఈ నెల 28న వసతి దీవెన మొదటి విడత నిధులు పడనున్నాయి.