కరోనా లక్షణాలున్నా, RT PCR లో నెగటివ్ వస్తోందా.. అయితే ఇలా చేయండి !

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోవడం ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. నిజానికి కేసుల కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా ఏవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో కరోనా గురించి అనేక అంశాలు టెన్షన్ పెడుతున్నాయి. అయితే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ RT – PCR టెస్ట్ లో నెగటివ్ అని వస్తోంది. దీంతో చాలా మంది టెన్షన్ కు గురవుతున్నారు.

అయితే వైరస్ కొత్త వేరియంట్లలో మార్పులు, ప్రజల నుంచి సేకరించిన స్వాబ్ సరిగా రవాణా చేయకపోవడం, నిల్వ చేయకపోవడం వలన తప్పుడు రిజల్ట్ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు ఉండి, నెగటివ్ వస్తే మాత్రం సీటీ స్కాన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు, లాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news