కేంద్రం ఎన్నో రకాల పథకాల్ని అందిస్తోంది. ఈ పథకాలతో చాలా మందికి ప్రయోజనం ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వాటిలో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. పాపకు 10 సంవత్సరాలు వచ్చే లోపు ఎప్పుడైనా కూడా మీరు ఇందులో చేరొచ్చు. దీనిలో చేరాక మొత్తం 15 సంవత్సరాలు పాటు మీరు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ తెరిచిన 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ మీకొస్తుంది. ఇక పూర్తి వివరాలని చూసేద్దాం..
పాపకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చదువు కోసం మీరు 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల కి మీరు పూర్తి డబ్బులని పొందవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు.
గరిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టవచ్చు. నెలకు రూ.2 వేలు, 3 వేలు, 5 వేలు, రూ.10 వేలు ఇలా ఎంతైనా కూడా మీరు కట్టవచ్చు. పోస్టాఫీస్ లేదా అన్ని కమర్షియల్/ప్రభుత్వ బ్యాంకుల్లో దీన్ని ఓపెన్ చెయ్యవచ్చు. ఈ స్కీము వడ్డీ రేటుని ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం సవరిస్తుంటుంది.
ఈ వడ్డీ ప్రస్తుతం 8 శాతానికి వచ్చింది. నెలకు రూ.10 వేలు కడితే ఎంతొస్తాయో అనేది చూద్దాం. ఈ ఖాతాని మీ పాప పేరు మీద తెరిచి నెలకు రూ.10 వేలు లేదా సంవత్సరానికి రూ.1.20 లక్షలు డిపాజిట్ చేస్తే.. పాపకు 15 సంవత్సరాలు వచ్చే వరకు కడుతూ ఉంటే రూ.18 లక్షలవుతుంది. 21 సంవత్సరాలు వచ్చాక పూర్తి డబ్బులు మీకొస్తాయి.
మీ అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. 8 శాతం వడ్డీ లెక్కన చూసుకుంటే రూ.18 లక్షలపై వడ్డీ రూపంలోనే రూ. 37.84 లక్షలు. ఏకంగా రూ.55.84 లక్షలని మీరు పొందవచ్చు. ఇక ఇంత మొత్తంలో కట్టలేం నెలకు రూ.1000 చొప్పున కడితే మీ పెట్టుబడి రూ.1.8 లక్షలవుతుంది.. ఇక మెచ్యూరిటీ కల్లా మీ చేతికి అప్పుడు రూ.5.58 లక్షలొస్తాయి. నెలకు రూ.5 వేల చొప్పున కడితే పెట్టుబడి రూ. 9 లక్షలు.. రిటర్న్స్ రూ. 27.92 లక్షలు అవుతాయి.