కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా..? ఈ కేంద్రం ప్రభుత్వ స్కీమ్ తో సాధ్యం..!

-

మనకి చాలా స్కీములు అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కటి లాభాలని పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఒక దీర్ఘకాలిక పెట్టుబడుల పథకం ఇది. ఆర్థిక ఇబ్బందులను తీరుస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగుండేందుకు ఈ స్కీమ్ ఉపయోగ పడుతుంది. ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీస్‌లో రూ. 100 డిపాజిట్ చేసి మీరు దీన్ని మొదలు పెట్టచ్చు.

ఏడాదిలో కనీసం 500 రూపాయలైనా డిపాజిట్ చెయ్యండి. పూర్తి వివరాలని చూస్తే.. లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసేందుకు అవుతుంది. ఏడాదిలో ఒకసారైనా కట్టొచ్చు లేకపోతే గరిష్టంగా 12 ఇన్‌స్టాల్‌మెంట్ల లోనూ పే చేయొచ్చు. పన్ను ప్రయోజనాలను కూడా పొందచ్చు. 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది.

30 ఏళ్ల వయసులో పీపీఎఫ్ అకౌంట్ తెరిచి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్ళు అవుతుంది. ఇంకో మూడు దఫాలు ఐదేళ్ల చొప్పున ఎక్స్టెండ్ చేసారు. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ 30 సంవత్సరాలు. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షల దాకా ఇందులో పెట్టచ్చు. 7.10 శాతం వడ్డీకి 30 ఏళ్ల తర్వాత అయితే మొత్తం రూ.1,54,50,911. సుమారు రూ.1.54 కోట్లు.

ఇన్వెస్ట్‌మెంట్ రూ.45 లక్షలు మాత్రమే. రూ.1.5 లక్షలు X 30 = రూ. 45,00,000. వడ్డీతోనే ఏకంగా రూ.1,09,50,911 మీకు అదనంగా వస్తుంది. మీరు రూ.45 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే రూ.1.54 కోట్లు వస్తాయి. ఏడాదికి కట్టే రూ.1.50 లక్షలను ఏడాదిలో ఒకేసారి లేదంటే వాయిదాల రూపంలో కట్టచ్చు. 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో కట్టొచ్చు నెలకు రూ.12,500 చొప్పున పే చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news