పాస్ పోర్ట్ కావాలా..? ఇలా అయితే 15 రోజుల్లోనే పొందొచ్చు…!

-

విదేశాలకి వెళ్లాలంటే పాస్ పోర్ట్ కచ్చితంగా ఉండాలి. అయితే పాస్ పోర్ట్ ని గతంలో పొందాలంటే ఎంతో కష్టం అయ్యేది. కానీ ఇప్పుడేం అలా కాదు. ఈజీగానే పాస్ పోర్ట్ ని మనం పొందొచ్చు. అయితే త్వరగా పాస్‌పోర్ట్ ని పొందాలంటే ప్రభుత్వం తత్కాల్ పాస్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తోంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. తత్కాల్ పాస్‌పోర్ట్ ని ఈజీగా పొందొచ్చు.

ముందుగా మీరు పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
అక్కడ కొత్త వినియోగదారుకు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు సమాచారాన్ని పూరించండి.
ఇక్కడ మీరిచ్చిన నగరం డీటెయిల్స్ ఏ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోండి. ధృవీకరణ కోసం అదే పోస్టాఫీసుకు వెళ్ళాలి.
డీటెయిల్స్ ని ఇచ్చేసాక మీరు రిజిస్టర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
తరవాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఈమెయిల్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చెయ్యాలి.
అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్ లేదా ఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్‌పై నొక్కండి.
ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ఫిల్ చెయ్యచ్చు.
వెబ్‌సైట్‌కి అప్‌లోడ్ అయినా చెయ్యచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా ఫిల్ చెయ్యచ్చు.
ఇది పూర్తయ్యాక వ్యూ సేవ్డ్ సబ్‌మిట్ అప్లికేషన్‌పై క్లిక్ చేయండి.
పేమెంట్ చేసి అప్లికేషన్ పొందండి. ఇది మీకు పాస్పోర్ట్ సేవ కేంద్రానికి వెళ్ళడానికి అవసరం.

తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా చెయ్యండి..

పాస్‌పోర్ట్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త వినియోగదారు నమోదుపై నొక్కండి.
వివరాలను ఎంటర్ చేసేసాక రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి.
మొదటి ఆప్షన్‌ తాజాది, రెండవ ఆప్షన్‌ రీ ఇష్యూ.
నెక్స్ట్ మీరు తత్కాల్ ఆప్షన్ పై నొక్కండి.
పోలీసు ధృవీకరణ అయ్యాక 10 నుండి 15 రోజులలో స్పీడ్ పోస్ట్ ద్వారా పాస్పోర్ట్ వచ్చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news