Big boss: 4వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఏకంగా 10 మంది..!!

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం నామినేషన్ లిస్టు తాజాగా లీక్ అయ్యింది. అయితే ఈసారి ఏకంగా 10 మంది నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరవ సీజన్లో నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 10 మంది నామినేట్ అయినట్లు సమాచారం.. నాలుగవ వారానికి సంబంధించి ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే విషయానికి వస్తే కీర్తి భట్, అర్జున్ కళ్యాణ్ ను హోస్టు నాగార్జున నామినేట్ చేయగా.. మిగిలిన వారిలో ఇనయ, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజశేఖర్, సూర్య లు ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

ఇకపోతే బిగ్ బాస్ ఆరవ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హాజరైన విషయం తెలిసింది. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నారు. వారిలో సింగర్ రేవంత్ కూడా ఒకరు. ముఖ్యంగా బయట భారీ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ కావడంతో అందరూ అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఇక ఫలితంగా మొదటి రోజు నుంచి నేటి వరకు వరుసగా నాలుగు సార్లు నామినేట్ అయిన ఏకైక కంటెస్టెంట్ రేవంత్ అని చెప్పవచ్చు. నిజానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకటిగా ఉండబోతున్న రేవంత్ ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక ఎలిమినేట్ కు నామినేట్ అయినప్పటికీ ఆయనను మాత్రం ఎలిమినేట్ చేయలేరు అని స్పష్టం అవుతుంది.

ఇక గీతూ కూడా ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోబోతోంది. ఎందుకంటే గీతూ లేకపోతే హౌస్ లో గొడవపడే వారే ఉండరు. ఇక ఆర్గ్యు చేసేవారు అసలు ఉండరు . అలాంటప్పుడు షో ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించదు. కాబట్టి ఈమె కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లబోతోంది. గతవారం నామినేషన్స్ నుంచి ఆరోహి, ఇనయా, సుదీపా తప్పించుకున్నారు . కాబట్టి వీరిలో ఒకరు కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ప్రేక్షకులు సైతం అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news