గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 870. అయితే గ్యాస్ సిలిండర్ ను మీరు ఇలా బుక్ చేసుకుంటే రూ. 170 కే పొందవచ్చు. అదెలాగో మనం తెలుసుకుందాం. ఇటీవలి ఇంధన ధరలు ఆకాశాన్ని ఎక్కడంతో దీని వల్ల వినియోగదారులకు చుక్కల్ని చూపిస్తున్నాయి. ఒకవైపు పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు మరోవైపు గ్యాస్ ధరల పెంపకంతో సామాన్య ప్రజలు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం వినియోగదారులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల గ్యాస్ బుకింగ్ పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాస్ బ్యాక్ అందుకోవాలంటే ఇలా చేయండి..
- మొదట పేటీఎం యాప్‌ను మీ మొబైల్‌లో ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత ‘రీఛార్జ్ అండ్ పే బిల్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
‘బుక్ గ్యాస్ సిలిండర్’ ఆప్షన్ ను ఎంచుకోండి. - ఇక్కడ మీరు వాడే సిలిండర్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి.
- రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్íపీజీ ఐడీని నమోదు చేయండి. బిల్ పే చేసిన తర్వాత సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.
- సిలిండర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఈ కార్డును మీరు 7 రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది
అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మరో ఏడు రోజులు మాత్రమే.