వాలంటైన్స్ డేకు గులాబీ రేకులతో ఇలా రెడీ అవ్వండి..లుక్ అదిరిపోవాల్సిందే..! 

-

రేపే వాలంటైన్స్ డే. మీ ప్రియమైన వారిని కలవడానికి ఈరోజు నుంచే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు కదా..ఇక కాలేజ్ లవ్ స్టోరీ అయితే..రేపు ఎలా కలవాలా అనీ తెగ హైరానా హడావిడీ చేస్తారు..లక్కీగా వారికోసమే అన్నట్లు..వాలంటైన్స్ డే సోమవారం ఇచ్చింది. ఆదివారం అయితే..అడ్డంగా దొరికిపోవయేవారు. కాలేజ్ కు వెళ్లడానికి వీలుండదు. మొత్తానికి రేపు మరీ ఏ డ్రస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు..ముఖానికి గులాభీ రేకులతో ఫేస్ ప్యాక్ మీ అందాన్ని ఇంకాస్త పెంచుకోండి మరీ..!
గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి సబ్బు ఉపయోగించకుండా నీటితో కడిగేసుకోండి.. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా కాంతిని సంతరించుకొని, పరిమళాన్ని వెదజల్లుతుంది.
ఈ మిశ్రమానికి తాజా ఫేస్ క్రీం కొద్దిగా కలిపి ముఖానికి మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మాన్ని నిగారించేలా చేయడమే కాకుండా పెదవులు కూడా పగిలిపోకుండా సంరక్షించుకోవచ్చు.
తాజా గులాబీ రేకలు కొద్దిగా తీసుకుని చిక్కగా ఉన్న పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అయితే ఇందుకు ఉపయోగించే గులాబీ రేకలు బాగా శుభ్రం చేసినవై ఉండాలి. అప్పుడే ఈ ప్యాక్ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
గులాబీ రేకలతో తయారు చేసిన పొడి ప్రత్యేకంగా మార్కెట్లో లభ్యమవుతుంది. లేదంటే కొన్ని గులాబీ పూల రేకల్ని ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చు. గులాబి పొడి కొద్దిగా తీసుకుని, అందులో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల చర్మం నిగారింపును కోల్పోకుండా ఉండటమే కాకుండా మెరుస్తూ తాజాగా ఉంటుంది.
రెండు చెంచాల సహజసిద్ధమైన గంధం, పావుకప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకలు తీసుకుని బాగా మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం గ్లోయింగ్ రావడమే కాకుండా.. యవ్వనంగా కూడా కనిపిస్తుంది.
ఇంట్లో గులాబి చెట్టు ఉంటే..ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు.. స్నానానికి వాడే నీళ్లలో గులాబి రేకులు వేసుకుని స్నానం చేస్తే..మంచి రిలీఫ్ ఉంటుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news