ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఐదు మార్గాలు.. మీకోసమే..

-

ఇల్లు బాగుంటేనే అందులో ఉండే మనుషులు బాగుంటారని చెబుతుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా కనిపిస్తే మనుషులు పరిశుభ్రంగా ఉంటారని అనుకుంటారు. అది నిజం కూడా. ఎవరైనా ఇంటికి వచ్చినపుడు రెండు నిమిషాలు కూర్చున్నా బాగుంది అనిపించాలి కానీ, ఎప్పుడెప్పుడు బయటకి వెళ్ళిపోదామా అని ఉండకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారికీ అందంగా కనిపించాలి. ఇంటిని అందంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీరెప్పుడూ శుభ్రపర్చని ప్రాంతాలని శుభ్రపర్చాలి

తరచుగా శుభ్రం చేసే ప్రాంతాలు కాకుండా చాలా రోజులుగా అలాగే ఉంచుతున్న ప్రాంతాలని శుభ్రం చేయండి. సీలింగ్ ఫ్యాన్స్, గోడలు, తలుపులు, కర్టెన్లు, చాపలు మొదలైన వాటిని శుభ్రం చేసుకోవాలి. వాటికి పట్టి ఉన్న దుమ్ము అంత త్వరగా పోదు కాబట్టి వాక్యూమ్ క్లీనర్ వాడడం మంచిది. ఇలా శుభ్రపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి.

ఆర్గనైజ్

బెడ్, సోఫా, టీపాయ్ మొదలగు ప్రదేశాలని మార్చండి. ఒక్కసారి అటూ ఇటూ ఇల్లంతా తిరిగితే ఎక్కడ తేడా ఉందో ఏం మార్చాలో అర్థమైపోతుంది. కొన్ని సార్లు చిన్న చిన్న మార్పులే పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే నిశితంగా పరిశీలించండి. మీ ఇంటి అందాన్ని మరింత పెంచే కొన్ని మార్పులు మీ కంటపడతాయి.

పని చేసుకునే స్థలం

మీరు ఇంటి నుండే ఉద్యోగం చేసే వారయితే, మీరు పని చేసుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. చిందరవందరగా గోల గోలగా ఉంటే మీ మూడ్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోండి.

గోడలపై చిత్రాలు

మీ మనసుని ఉల్లాస పరిచే ఆహ్లాదకరమైన చిత్రాలని గోడల మీద చిత్రీకరించుకోండి. దానివల్ల ఇంట్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version