చుండ్రు సమస్య ఎంతో మందికి రోజు వారి పెద్ద సమస్యగా ఉంటుంది. తలపై చుండ్రు ఉంటే చిరాకుగా, తల అంతా దురదలుగా విసుగు పుట్టిస్తుంది. ఈ సమస్య గనుకా చెక్ పెట్టక పొతే చిరాకు మాట అలా ఉంచితే ఎంతో ఒత్తుగా, నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవారికి జుట్టు రాలిపోయి, జుట్టు అంతా నిర్జీవంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే చుండ్రుకి సాధ్యమైనంత త్వరగా చెక్ పెట్టేయాలి.
అయితే చాలా మంది చుండ్రు పోవడానికి మార్కెట్ లో దొరికే రసాయనిక షాంపోలు వాడుతారు.వీటి ప్రభావం వలన చుండ్రు తాత్కాలికంగా పోవచ్చు కానీ మళ్ళీ తిరిగి చేరుతుంది. అంతేకాదు రాసాయనిక మందుల ప్రభావం వలన జుట్టు ఊడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే సహజసిద్దంగా చుండ్రుని పోగొట్టే పద్దతులని తెలుసుకోవడం ఉత్తమం. కానీ చాలా మందికి పూర్వం మన పెద్దలు ఎలాంటి పద్దతులని చుండ్రు పోగొట్టడానికి ఉపయోగించారో తెలియదు. మరి పూర్వీకులు ఎలాంటి పద్దతులని పాటించేవారో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా చుండ్రు పోగొట్టడానికి అందరికి తెలిసిన ఏకైక పద్దతి నిమ్మకాయతో తలపై రుద్దటం కాసేపటి తరువాత తల స్నానం చేయడం. అయితే ఈ ప్రయత్నం మాత్రమే కాకుండా కుంకుడు, శీకాయ లని తీసుకుని రెండిటిని నీళ్ళలో నానబెట్టి వచ్చిన మిశ్రమంతో తలస్నానం చేస్తే తప్పకుండా చుండ్రు సమస్య పోతుంది.
స్వచమైన కొబ్బరి నూనెలో ఒక చెక్క నిమ్మరసం పిండి. ఆ నూనెని తలపై చర్మానికి బాగా పట్టించి ఒక అరగంట పాటు ఆరనిచ్చి తరువాత కుంకుడు కాయలతో తలంటు పోసుకుంటే చుండ్రు దాదాపు దూరం అయినట్టే.
గసగసాలు చుండ్రుని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా గసగసాలు కొన్ని తీసుకుని వాటిని మెత్తటి పేస్టుగా చేసుకుని తల భాగంలో బాగా పట్టించి. ఒక అరగంట పాటు ఆరనివాలి. ఆ తరువాత శీయాక లేదా కుంకుడు మిశ్రమంతో తల స్నానం చేస్తే చుండ్రు రమ్మన్నా రాదు.