రూ.436 చెల్లిస్తే… రూ.2 లక్షలు.. ఈ మోడీ స్కీమ్ తో…!

వివిధ రకాల స్కీమ్స్ ని అందిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్స్ వలన మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒక మంచి స్కీమ్ అనే చెప్పచ్చు. కేంద్రం అందించే ఇన్సూరెన్స్‌ పథకాల్లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి. దీని వలన మనకు చాలా లాభాలు ఉంటాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు బెనిఫిట్ కలుగుతుంది. ప్రధాన్‌ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్‌ స్కీమ్‌. దీని ద్వారా ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ కూడా మనం పొందేందుకు అవుతుంది.

ఒకవేళ కనుక పాలసీ దారుడు మరణిస్తే అప్పుడు వారి కుటుంబానికి రూ. 2 లక్షలు లభిస్తాయి. ఈ స్కీమ్ లో చేరితే ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో మీరు చేరాలని అనుకుంటే జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ ఉంటుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు వున్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరచ్చు.

ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన స్కీమ్‌లో చేరాలంటే బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌ కార్డు ఉండాలి. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి ఏడాది రూ.436 పే చెయ్యాలి. అప్పుడు పాలసీ రెన్యూవల్ అవుతుంది. ఒకవేళ వారు మరణిస్తే.. నామినీకి రూ.2 లక్షలను ఇస్తారు.