GHANI : గని నుంచి బిగ్ అప్టేట్..టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

గద్దల కొండ గణేస్‌ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఈ సినిమా అనంతరం.. గని మూవీలో నటిస్తున్నాడు వరుణ్‌ తేజ్. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు.

సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే… ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ విడుదల తేదీ తో పాటు సినిమాలో పాత్రలను పరిచయం చేసింది చిత్ర బృందం. నవంబర్‌ 15 వ తేదీన ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేస్తున్నట్లు అనౌన్స్‌ చేసింది. అలాగే.. ఈ సినిమా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ప్యాన్స్‌ లో నూతన కోలాహలం నెలకొంది. కాగా ఈ సినిమాను డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news