ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది కాస్త ప్రత్యేక శైలి. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే అధినేత నుంచి మంచి గుర్తింపు ఉంటుంది. దీంతో ఆయన విశాఖ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారనే వ్యాఖ్యలు వినబడుతూ ఉంటాయి. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయన తెలుగుదేశం నుంచి ఆ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఐదేళ్ల పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు.
ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఆయన టిడిపిలో జాయిన్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంచి గుర్తింపు ఇచ్చారు. 2009 నుంచి 2013 వరకు ఆయన నిర్వహించిన విద్యాశాఖను మరోసారి ఆయనకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన చంద్రబాబును వెన్నుపోటు పొడుస్తున్నారు అని అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన మాట కూడా చెల్లడటం లేదని అంటున్నారు కొందరు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ విశాఖను రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు జగన్ కు మద్దతు ప్రకటించారు పరోక్షంగా జగన్ కు. అన్ని విధాలుగా ఆయన విశాఖలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం లో ఎక్కువ స్థానాలు అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీనికి కారణం గంటా వర్గాలు అన్ని కూడా అధికార పార్టీకి పరోక్షంగా సహకరిస్తున్నాయి. నియోజకవర్గంలో నామినేషన్ వేద్దాం అనుకున్న వాళ్లను కూడా వెనక్కు తగ్గే విధంగా చేసారట.