తెలుగు తమ్ముళ్లకు బిగ్‌షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ

-

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే ప్రక్రియను చేపట్టారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు నగరంలోని ప్రధాన కూడళ్లలో పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే, వాటికి అనుమతి లేదని జీహెచ్ఎంసీ సిబ్బంది ఆదివారం ఉదయమే తొలగించడం ప్రారంభించారు. ఇదిలాఉండగా, ఉగాది రోజున పండగ పూట ఫ్లెక్సీలు తీసేయడం ఏంటి అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. సెలవు దినం రోజున కూడా జీహెచ్ఎంసీ పనిచేస్తుందా? అని కూడా కొందరు సెటైరికల్‌గా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news