బ్రేకింగ్ : గ్రేటర్ లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్ హైదరాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 150 డివిజన్లకు సంబంధించిన 150 రిటర్నింగ్  కార్యాలయాలు ఏర్పాటు చేయగా ఆయా కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్  అధికారి ఛాంబర్ లోకి అనుమతి ఇస్తున్నారు. ఇక నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.

ఫ్లెక్సీలు , బ్యానర్ల తొలగింపు కోసం 20 ప్రత్యేక బృందాలను జీహెచ్ ఎంసీ  ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఏర్పాటు చేసింది. నిన్న ఒక్క రోజే దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్లని తొలగించారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘము నిబంధనల ప్రకారం  నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి మీడియాకి కూడా అనుమతి లేదు. ఇక ఈ ఎన్నికల ప్రక్రియకు కేవలం మూడి రోజులు మాత్రమే నామినేషన్స్స్ కు అవకాశం ఉంది.