సినీ నటుడు పృథ్విరాజ్‌కు హైబీపీ..!

-

సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో ఆయన బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2 రోజుల క్రిందట ‘లైలా’ ఫంక్షన్‌లో పృథ్విరాజ్‌ పొలిటికల్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. పొలిటికల్‌ కామెంట్స్‌తో ట్రోల్‌ అవుతున్నారు పృథ్విరాజ్‌. 

లైలా మూవీ ఈవెంట్ లో 150 మేకలు.. 11 మేకల కథ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి.. జగన్ ని దెప్పి పొడుస్తూ చేశారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినప్పటికీ వైసీపీ సోసల్ మీడియా వారియర్స్ కొంత మంది ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. పృథ్వీనే క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు పృథ్వీ మాత్రం జగన్ కి సారీ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పృథ్వీ ప్రస్తుతం హైబీపీ తో బాధ పడటం కాస్త బాధ పెట్టే విషయం అనే చెప్పాలి.  

Read more RELATED
Recommended to you

Exit mobile version