ఏఆర్ రెహమాన్ బొమ్మతో.. గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న యువతి !

-

ఎ. ఆర్. రెహమాన్ పేరు తెలియని వారుండరు. ఎ. ఆర్. రెహమాన్ అసలు పేరు అల్లా రఖా రెహమాన్.. సంగీత దర్శకుడుగా, స్వరకర్త, గాయకుడుగా అల్లా రఖా రెహమాన్.. ఎంతో మంచి పేరు సందించుకున్నారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కించుకున్న ఎ. ఆర్. రెహమాన్… దేశంలోనే ఉత్తమ సంగీత దర్శకుడుగా, పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ చిత్రాన్ని గీసి.. ఓ యువతి ఏకంగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.

తమిళనాడు లోని మళప్పురం ప్రాంతానికి చెందిన సూర్య అనే యువతి.. 71 అంగుళాల పొడవైన ఎ. ఆర్. రెహమాన్ చిత్రాన్ని గిసింది. అయితే ఈ చిత్రం లో ఏకంగా ఎ. ఆర్. రెహమాన్ పని చేసిన 391 పాటలు ప్రతి బింబించేలా.. గిసింది యువతి సూర్య. ఈ ఎ. ఆర్. రెహమాన్ చిత్రాన్ని కేవలం.. రెండు గంటల 20 నిమిషాల్లోనే గీసి.. చరిత్ర సృష్టించింది సూర్య. దీంతో తాజాగా ఎ. ఆర్. రెహమాన్ చిత్రాన్ని గిసినందుకు గాను గిన్నీస్ బుక్ చోటు సంపాదించింది యువతి సూర్య. డిగ్రీ ఊరతి చేసిన సూర్య.. ఈ ఘనత సాధించడంపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news