రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యే కు జీవిత ఖైదు..!

-

రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యే కు జీవిత ఖైదు పడింది. ఉత్తర ప్రదేశ్ లో 2008లో ఎమ్మెల్యేగా ఉన్న యోగేంద్ర సాగర్ పై అప్పట్లో ఓ యువతి ఫిర్యాదు చేయగా పదమూడు సంవత్సరాలకు అతడిని కోర్టు దోషిగా తేల్చింది. 13 ఏళ్ల క్రితం ఓ యువతి ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తాజాగా బదాయూలోని ప్రజాప్రతినిధుల కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

మొత్తానికి ఎమ్మెల్యే కు శిక్ష పడింది కానీ అసలు కోర్టు తీర్పు తో యువతికి న్యాయం జరిగిందా లేదా అన్నది అర్థం కావడం లేదని ఈ వార్త విన్న ప్రజలు అనుకుంటున్నారు. పదమూడేళ్ళ లో యువతి జీవితం లో ఎన్నో మార్పులు వచ్చి అసలు ఈ కేసును అయినా పట్టించుకుంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఎన్నో కేసుల్లో తీర్పులు రావడం ఆలస్యం అవ్వడం సాధారణమే..కొన్ని కేసుల్లో అయితే తీర్పు వచ్చేసరికి ముద్దాయిలు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news