కుప్పంలో బాబు ఫీట్లు..25 వార్డుల్లో సైకిల్‌కు పంక్చర్లేనా?

-

అసలు కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట…చంద్రబాబు కాలు పెట్టకుండా ఆయన బొమ్మ ఉంటే చాలు..కుప్పంలో టీడీపీ గెలిచేస్తుంది…గత ఏడు ఎన్నికల్లోనూ అదే పరిస్తితి…ఆయన కనీసం ప్రచారానికి కూడా వెళ్లారు. అయినా కుప్పం ప్రజలు ఏడు సార్లు బాబుని గెలిపించుకున్నారు. అలా అడుగుపెట్టే అవసరం లేకపోయిన గెలిచే చంద్రబాబుకు ఇప్పుడు ఏమైంది…వరుసపెట్టి కుప్పం వీధుల్లో పర్యటిస్తూ హడావిడి చేసేస్తున్నారు? అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో బాబుకు బొమ్మ కనబడటం మొదలైంది.

chandrababu naiduపంచాయితీ ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ ఓడిపోయింది..దాదాపు 90 శాతం పంచాయితీలు వైసీపీ కైవసం చేసుకుంది. ఈ దెబ్బతో చంద్రబాబు కుప్పంలో ఎంట్రీ ఇచ్చి, గత మార్చిలో నియోజకవర్గం మొత్తం తిరిగారు. సరే అది పోయింది…ఇటీవలే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టిసి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సైతం కుప్పంలో వైసీపీదే పైచేయి. దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. దీంతో బాబుకు బొమ్మ కనబడటం ఖాయమైంది.

అసలు కుప్పంలో బాబు ఓడిపోయే పరిస్తితికి వచ్చారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం…పైగా కుప్పం మున్సిపాలిటీకు ఎన్నిక జరగనుంది. దీంతో మున్సిపాలిటీని కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బాబు అలెర్ట్ అయ్యారు…సడన్ గా కుప్పంలో ఎంట్రీ ఇచ్చేశారు. తన హయాంలో మున్సిపాలిటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని చేయలేదని, ఇప్పుడు చేశారని, కానీ మున్సిపాలిటీలో వైసీపీని చిత్తు చేయాలని మాట్లాడుతున్నారు.

కొందరు పుడంగిలు డబ్బులు సంచులు పట్టుకుని వస్తారని, వైసీపీ వాళ్లు ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఆశ చూపిస్తారని, వారి ప్రలోభాలకు లొంగకుండా, మన కుప్పం పౌరుషం ఏంటో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించాలని, 25 వార్డుల్లోను మనమే గెలిచి చూపించాలని టీడీపీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. అంటే మామూలు ఎన్నికలకే కుప్పంలో అడుగుపెట్టని బాబు…ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికకు వచ్చి కుప్పంలో ఫీట్లు వేస్తున్నారు. అంటే కుప్పంలో బాబు పరిస్తితి ఎలా ఉందో అర్ధమవుతుంది…25 వార్డుల్లో గెలవడం పక్కనబెడితే…25 వార్డుల్లో సైకిల్‌కు పంక్చర్లు పడకుండా చూసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news