ప్రేమించాలంటూ వేధింపులు… మైనర్ బాలిక ఆత్మహత్య..!

ప్రేమించాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బట్టు రజమల్లు కూతురు దుర్గ భవాని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది దుర్గాభవానిని అదే గ్రామానికి చెందిన గురజాల ఏలెందర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేదింపులకు గురి చేస్తున్నాడు. కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో కొందరు స్నేహితులతో కలిసి ఏలేందర్ భవానిని వేధిస్తున్నాడు. ఏడాది క్రితమే భవాని తండ్రికి ఆ విషయం తెలిసింది.

Girl suside in bhuvanagiri
Girl suside in bhuvanagiri

దాంతో ఆయన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. దాంతో ఇకపై వేధించనని యువకుడు ఒప్పుకున్నాడు. కానీ ఆ యువకుడు భవాని ఫోన్ నెంబర్ సేకరించి మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గడ్డి మందు తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి తీసుకువచ్చారు. అయితే అకస్మాత్తుగా ఈ నెల 20న తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటనపై యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.