దూసకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలోని… కడప చిత్తూరు అలాగే అనంతపూర్ జిల్లాలో అటు కోస్తా ప్రాంతంలో ని… నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ మరోసారి అందరినీ అలెర్ట్ చేసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది వాతావరణ శాఖ.

దీని ప్రభావం శ్రీలంక – దక్షిణ తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తోంది. అంతేకాదు బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే తమిళనాడు పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే చిత్తూరు అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news