ఏపీ టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదయింది. బాలికలదే పై చేయి అయ్యింది. పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించారు. బాలురు 84.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 2803 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణతతో నిరాశపరిచాయి.
మార్చి 18 నుండి 30 దాకా 10 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకి 616615 మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఒక విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ లేదు ఒక ఉపాధ్యాయుని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందే 10 ఫలితాలు ఇస్తున్నామని చెప్పారు.