విరాళంలో రికార్డులు సృష్టించిన జామ్‌ సెట్జీ టాటా..లిస్ట్‌లో లేని ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల పేర్లు

-

డబ్బున్న వారు విరాళాలు చేస్తుంటారు.. విరాళం అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చే పేరు రతన్‌ టాటా.. కానీ దానంలో వీరకంటే ఎక్కువ చేసిన వ్యక్తి చరిత్రలో ఒకరు ఉన్నారు. భారతదేశపు అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్‌ను స్థాపించిన ఒక మార్గదర్శక భారతీయ పారిశ్రామికవేత్త. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు అతని పేరే జామ్‌ సెట్జి టాటా.. ఎడెల్‌గివ్ ఫౌండేషన్ హురున్ రిపోర్ట్ 2021 ప్రకారం, అతను రూ. 8,29,734 కోట్లు విరాళంగా అందించారు.

టాటా హీరాబాయి దాబూను వివాహం చేసుకున్నారు. వారి కుమారులు, దొరాబ్జీ టాటా మరియు రతన్‌జీ టాటా , టాటా తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్‌లుగా ఉన్నారు. జామ్‌సెట్జీ టాటా విద్య మరియు ఆరోగ్య రంగాలకు భారీ విరాళాలు అందించారు. నివేదికల ప్రకారం, అతను 1892లో తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. అతను 1904లో మరణించినప్పటి నుంచి టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా టాటా గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.

USD 37.4 బిలియన్ల విరాళంతో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ మూడవ స్థానంలో ఉన్నారు.

USD 34.8 బిలియన్లతో జార్జ్ సోరోస్ మరియు USD 26.8 బిలియన్లతో జాన్ డి రాక్‌ఫెల్లర్ తర్వాతి స్థానంలో ఉన్నారు. .

టాప్ 50 ప్రపంచ దాతల జాబితాలో మరో భారతీయుడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. అతనే విప్రో వ్యవస్థాపకుడు అసిమ్ ప్రేమ్‌జీ. అతను 22 బిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల పేర్లు జాబితాలో లేకపోవడం.

Read more RELATED
Recommended to you

Latest news