కర్నూలు జిల్లాలో కొత్తగా నయామోసం బయటపడింది. ఏటీఎం మెషిన్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వినియోగదారులను ఓ కీలాడీ బురిడీ కొట్టిస్తున్నాడు.ఈ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏటీఎం మిషిన్ వద్ద ఉంటున్న ఓ వ్యక్తి అటుగా వచ్చిన వ్యక్తులు క్యాష్ చేసేటప్పుడు వారితో మాటలు కలుపుతాడు. మీ దగ్గర నగదు ఉంటే నాకు ఇవ్వండి ఫోన్ పే చేస్తానని నమ్మిస్తాడు.
అలాగే మెల్లిగా మాటలు కలుపుతాడు. ఆ తర్వాత ఫోన్ పేలో డబ్బులు పంపిస్తానని చెప్పి నగదు తీసుకుంటాడు. అనంతరం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ లావాదేవీలు జరుపుతాడు. మనీ వచ్చినట్లే వచ్చి రాలేదని గ్రహించిన పలువురు వినియోగదారులు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బురిడీ కొట్టిస్తున్న యువకుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.