మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ట్రిపుల్ ఆర్ చిత్రం లో తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎన్నో అవార్డులు, రికార్డ్స్ అందుకున్న రామ్ చరణ్.. తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నారు.చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవాళ ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.