Kollywood : జైలర్ మూవీకి సీక్వెల్ గా రానున్న ‘హుకుం’ ?

-

చాలా గ్యాప్ త‌ర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ర‌జ‌నీకాంత్ స్టామినా ఏంటో మ‌రోమారు చూపించింది. 2023 అగ‌స్టులో విడుద‌లైన ఈ మూవీ స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 650 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. దీంతో కొంత‌కాలం ఈ సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిల‌వ‌గా దీనికి సీక్వ‌ల్ కూడా ఉంటుంద‌నేలా సోష‌ల్ మీడియాలో బాగా చ‌ర్చ‌లు కూడా జ‌రగాయి.అయితే.. ఇప్పుడా వార్త‌ల‌ను నిజం చేస్తూ త్వ‌ర‌లో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

జైల‌ర్ సినిమాలో ర‌జ‌నీ వాడిన హుకూం అనే ప‌దాన్ని టైటిల్ గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయాన్’ (తెలుగులో వేటగాడు) అనే సినిమా చేస్తున్నారు.అదేవిధంగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న‌ Thalaivar171 మూవీ షూటింగ్ ఈవారం మొద‌లువుతుండ‌గా 2024లో విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news