దేశవ్యాప్తంగా ఉన్న జీమెయిల్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీమెయిల్ సర్వీస్ ప్రస్తుతం అనేక చోట్ల డౌన్ అయింది. చాలా మంది యూజర్లు జీమెయిల్‌లోకి లాగిన్ అవలేకపోతున్నారు. లాగిన్ అయినప్పటికీ కొందరికి ఫైల్స్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ కావడం లేదు. ఇంకొందరు మెయిల్స్ ను పంపలేకపోతున్నారు. మెయిల్స్ ను పంపాలని చూస్తే చెక్ యువర్ నెట్‌వర్క్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తోంది.
అయితే కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు కూడా జీమెయిల్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ అనే సంస్థ తెలిపింది. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ స్పందించింది.
User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown
— Downdetector Canada (@downdetectorca) August 20, 2020
Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K
— Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020
జీమెయిల్, గూగుల్ డ్రైవ్ యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, ప్రస్తుతం ఆయా సమస్యలను పరిశీలిస్తున్నామని గూగుల్ తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మళ్లీ అప్‌డేట్ రూపంలో అందజేస్తామని కూడా ఆ సంస్థ తెలియజేసింది. కాగా ఈ సమస్యల పట్ల నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.