రాజకీయాల్లో చిత్రమైన రాజకీయాలు చేసే టీడీపీ నాయకులు అంతకంటే చిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. తమకు నచ్చిన వారు.. తమ తరపున గళం వినిపిస్తున్నవారిని తమ బ్యాచ్‌గా ముద్రవేసుకుని ప్రచారం చేయడమో.. లేదా కులం పేరుతో రాజకీయాలు చేస్తూ.. ఆ కులం వారికి జగన్ వ్యతిరేకమని.. ఆ కులం ఓట్లు వేయించుకుని, ఆ కులాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖలో డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగింది ఇదే. ఆయన కులం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ, పోలీసులు ఆయనను నిర్బంధించే సరికి ఆయన కులాన్ని తెరమీదికి తెచ్చింది.. టీడీపీ నాయకులే.. దీంతో అది రాజకీయంగా వారికి పనికివచ్చేలా చేసుకున్నారు.
ఇక, ప్రకాశంలో ఇటీవల పోలీసుల వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కులం కూడా అప్పటి వరకు ఎవరికీ తెలియదు.. కానీ, తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో తమ్ముళ్లు దూకుడుగా వ్యవహరించి.. వారి కులాన్ని బజారుకు ఈడ్చారు. ఈ సమయంలో మృతిచెందిన యువకుడి తండ్రి.. అయ్యా ఇప్పటి వరకు మేం ఎంతో గౌరవంగా బతికాం.. కులం ప్రాతిపదకన ఎందుకు మమ్మల్ని రోడ్డుకు ఈడుస్తున్నారంటూ.. నేరుగా టీడీపీ నేతలపై ప్రశ్నలు కురిపించారు. ఇలా తకు అనుకూలంగా ఉన్నవారిని భుజాన ఎక్కించుకోవడంలో టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదేసమయంలో తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. వెంటనే జగన్ కూటమి నాయకులని, రెడ్డి వర్గమని ముద్రవేస్తూ.. విష ప్రచారానికి దిగుతున్నారు.
తాజాగా సోషల్ మీడియా సైట్లలో ఈ రోజు ఓ ఫొటో వచ్చింది. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు `శాస్త్రి` తగిలించారు. అంటే కులాన్ని ఆపాదించారు. ఇక, అక్కడితో ఊరుకోలేదు. ఈ యన జగన్‌కు బంధువు.. అనే కోణంలో విష ప్రచారానికి తెరదీశారు. జీవీఎల్ శాస్త్రి.. జగన్ సొంత బావ..(చెల్లెలు భర్త) బ్రదర్ అనిల్ (శాస్త్రి)కి మేనత్త కొడుకే జీవీఎల్ అని కామెంట్లు కుమ్మరించారు. అంటే.. నిన్నటికి నిన్న చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఆధారాలు ఇంకా ఏమీ లేకుండానే హుటా హుటిన ప్రధానికి లేఖ రాశారు. దీనిపై జీవీఎల్ సీరియస్ అయ్యారు. అసలు వాస్తవాలు లేకుండా ఎలా రాస్తారని ఆయనను నిలదీశారు.
అంతేకాదు, గతంలో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అయినప్పడు కూడా ప్రధానిగా మోడీ ఉన్నారని, పైగా బంధం కూడా ఉందని, ఆ సమయంలో ఎందుకు రాయలేదని నిలదీశారు. ఇక, అమరావతి విషయంలో కేంద్రం పట్టించుకోదని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో జీవీఎల్‌ను టార్గెట్ చేస్తున్న టీడీపీ తమ్ముళ్లు.. తాజాగా ఆయనను జగన్ కూటమి కింద కట్టేస్తూ.. విష ప్రచారానికి తెరదీయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ అఘాయిత్యం, పైత్యం .. కమ్మ కులం ప్రతిపాదన ఈ రేంజ్‌లో ఉంటుందా? అని నివ్వెర పోతున్నారు.