గంజాయి పండించడం ఎక్కడైనా నిషేధమే. దేశ వ్యాప్తంగా ఈ మొక్కని పండించడం నిషేధించారు. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ వారు 1985లో గంజాయి మొక్కని పండించడం నిషేధించారు. అప్పటి నుండి గంజాయి పండిస్తున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. కానీ ప్రస్తుతం గోవా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గంజాయి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిందే. దానికి వ్యతిరేక దిశలో మాదక ద్రవ్యాలు ఔషధాల తయారీకి కూడా ఉపయోగపడతాయి.
ప్రస్తుతం గోవా ప్రభుత్వం చేస్తున్నదదే. ఔషధాల తయారీ కోసం మారిజువానా మొక్కని పెంచడానికి సిద్ధం అవుతుంది. పరిమిత సంఖ్యలో ఈ మొక్కను పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఔషధాల తయారీలో మారిజువానా ఉపయోగపడుతుందని అందుకోసం ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు పరిశీలించిన గోవా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.