మీరు కూడా మంచి ట్రిప్ వేయాలనుకుంటున్నారా..? ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా..? చాలా మంది బ్యాచిలర్ ట్రిప్ కోసం గోవా వెళ్తూ ఉంటారు. నిజానికి గోవా మాత్రమే కాదు బ్యాచిలర్ ట్రిప్ కోసం చూసే వాళ్ళు ఈ ప్రదేశాలకే కూడా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.
చాలా మంది వివాహానికి ముందు ఫ్రెండ్స్ ని మిస్ అవ్వకూడదని ఇటువంటి ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. దీనితో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలని పొందొచ్చు. అయితే మీరు కూడా ఇలాంటి ట్రిప్ వేయాలి అనుకుంటే ఈ ప్రదేశాలకి వెళ్లి వచ్చేయొచ్చు మరి ఇంక వాటికోసం చూసేద్దాం.
ఉదయపూర్, రాజస్థాన్:
ఇక్కడ విశాలమైన కోటలు, భవనాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అద్భుతమైన సాంప్రదాయ ఆహారాలతో ఎంతో బాగుంటుంది. బ్యాచిలర్ ట్రిప్ కోసం చూసే వాళ్ళు ఇక్కడకి వెళ్లి వచ్చేయచ్చు.
పాండిచ్చేరి, తమిళనాడు:
ఇక్కడకి కూడా మీరు వెళ్ళచ్చు. ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంటుంది. అద్భుతమైన బీచ్‌లు కూడా వున్నాయి. ఇవి అందరికీ నచ్చేస్తాయి.
స్పితి వ్యాలీ, లడఖ్:
ఇది అందమైన చల్లని పర్వత ఎడారి. ఇక్కడ బంజరు హిమాలయాలు, అందమైన పట్టణాలు చాలా చక్కగా ఉంటాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కనుక బ్యాచిలర్ పార్టీని హోస్ట్ చేయాలంటే ఇది బాగుంటుంది.
అలెప్పీ, కేరళ:
హౌస్ బోట్ క్రూయిజ్‌లకు ఇది బాగా ఫేమస్. కేరళలోని వున్న ఈ చిన్న నగరం చాలా బాగుంటుంది. అందరికీ నచ్చేస్తుంది కూడా.