తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నది వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది.ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 42.2 అడుగులకు చేరింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4.72లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వరద ఇన్ ఫ్లో 3.05 లక్షలు, ఔట్ ఫ్లో 3.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది.
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు గ్రామాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆహారం,తాగునీరు, మెడిసిన్స్ డ్రోన్లు, పడవల ద్వారా అందిస్తున్నారు. పలుగ్రామాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బోట్లను వినియోగిస్తున్నారు.