బ్రేకింగ్; బిజెపిలోకి రజని కాంత్…?

-

తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ బిజెపిలో చేరే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి రజని రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఇప్పటికి కూడా ఏ విధమైన స్పష్టతా రావడం లేదు. ఆయన సొంత పార్టీ పెడతారా లేదా ఏదైనా పార్టీలో చేరతారా అనే దానిపై కూడా ఏ విధమైన స్పష్టత లేదు. రాజకీయాల్లోకి వస్తాను అని లేటు వయసులో రజని కాంత్ ప్రకటించారు.

ఆ తర్వాత ఆయన ఎక్కువగా సినిమాలు చేసుకున్నారు గాని దాని మీద ఏ మాట చెప్పడం లేదు. అయితే రజని మాత్రం బిజెపికి దగ్గరగా ఉన్నారు. తమిళనాట హిందు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో బిజెపి అక్కడ బలపడే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది. ఇప్పటికే అన్నాడిఎంకె తో మంచి సంబంధాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే బిజెపి రజని కాంత్ ని అడ్డం పెట్టుకుని బలపడాలని చూస్తుంది.

తాజాగా ఆయన తమిళులు ఆరాధ్య దైవంగా భావించే పెరియార్ రామస్వామి లక్ష్యంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పేది లేదని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎన్ని ఆందోళనలు అవుతున్నా ఆయన మాత్రం క్షమాపణ చెప్పడం లేదు. ఈ వ్యాఖ్యలపై బిజెపి హర్షం వ్యక్తం చేసింది. సంఘ్ పరివార్ కూడా ఆనంద పడింది. దీనితో బిజెపిని సంతోషపెట్టడానికే ఆ వ్యాఖ్యలు చేసారని ఆయన బిజెపిలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news