హైదరాబాద్ ను వణికించిన జంట పేలుళ్లకు పద్నాలుగేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 14ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ ప్రాంతాల్లో ఉగ్రావాదులు బాంబులు పెళ్లి పేళుల్లకు పాల్పడ్డారు. 2007 ఆగస్టు 25 హైదరాబాద్ లో ఈ జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్ల లో మొత్తం 44 మంది మృతి చెందారు. అంతే కాకుండా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 14 ఏళ్ళు అయినా ఇంకా ఆ రక్తపు మరకలు మానలేదు. పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ కుట్రపన్నింది.
ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షను వేసింది. A-1 అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయించిన తారిఖ్ అంజుమా కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 14 ఏళ్ళైనా ప్రభుత్వం తరపున బాధితుల కు సహాయం కూడా అందలేదు.