షాకింగ్ ఘ‌ట‌న‌..అంత్యక్రియ‌ల త‌రవాత 11ఏళ్ల‌కు తిరిగొచ్చిన మ‌హిళ‌..!

-

మాన‌సిక‌స్థితి స‌రిగ్గాలేని ఓ మ‌హిళ ఇంటి నుండి వెళ్లిపోయింది. దాంతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌లో..బంధువ‌ల ఇంటివ‌ద్ద వెతికిన కుటుంబ సభ్యుల‌కు ఓ కుల్లిన‌శ‌వం దొర‌కడంతో అంత్య‌క్రియ‌లు పూర్తిచేశారు. కాగా 11ఏళ్ల త‌ర‌వాత ఇంటి నుండి వెళ్లిపోయిన మ‌హిళ తిరిగివ‌చ్చింది. ఈ ఘ‌ట‌న జగిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి మండ‌లం జ‌గ్గాసాగ‌ర్ గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన రెంజ‌ర్ల ల‌క్ష్మి అనే మ‌హిళ ముగ్గురు కుమార్తెలు ఉండ‌గా భ‌ర్త గ‌ల్ఫ్ లో ఉంటున్నాడు. ప‌ద‌కొండేళ్ల క్రితం ల‌క్ష్మి ఇంటి నుండి వెళ్లి పోయింది.

jagithyala latest news

కాగా ఇంట్లో నుండి వెళ్లి పోయిన రెండేళ్ల‌కు స‌మీప అట‌వీ ప్రాంతంలో ఓ కుల్లిపోయిన శ‌వం ల‌భించింది. దుస్తుల ఆదారంగా ల‌క్షినే అని కుటుంబ స‌భ్యులు భావించారు. అంత్య‌క్రియ‌ల‌ను కూడా నిర్వ‌హించారు. ఇదిలా ఉంటే ఇంటి నుండి వెళ్లిపోయిన ల‌క్ష్మి తమిళ‌నాడుకు చేరుకుంది. అక్క‌డ ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌వారు ల‌క్ష్మిని చేర‌దీసి ఆమెకు చికిత్స అందించ‌గా సాధార‌ణ స్థితికి వ‌చ్చింది. అనంత‌రం త‌న వివరాల‌ను వారికి తెలిపింది. దాంతో స్వ‌చ్చంధ సంస్థ‌వారు ల‌క్ష్మి కుటుంబ స‌భ్యుల స‌మాచారం సేక‌రించి ఆమెను వారికి అప్ప‌గించారు. 11ఏళ్ల ఆర‌వాత త‌మ త‌ల్లి తిరిగి రావ‌డంతో భర్త‌, కూతుళ్లు ఆనందంతో ఉబ్బిత‌బ్బి పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news